కమలనాధన్ కమిటీని కీలుబొమ్మలా ఆడిస్తోంది
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు.
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. కమలనాధన్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని దేవీ ప్రసాద్ హెచ్చరించారు.
18 (ఎఫ్ ) నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ జీవోను తొలగించాల్సిందేనని టీఎన్‌జీ వో నేత విఠల్ అన్నారు. కమలనాధన్ కమిటీని కేంద్రం కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందని, జోనల్, జిల్లా పోస్టుల విభజన కూడా జరగాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెకిలి చేష్టలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు చేశారు.