సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్ | Devi Prasad sought the support of CPM | Sakshi
Sakshi News home page

సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్

Published Sat, Mar 7 2015 4:38 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్ - Sakshi

సీపీఎం మద్దతు కోరిన దేవీప్రసాద్

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీచేస్తున్న దేవీప్రసాద్ శుక్రవారం ఎంబీభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరఫున తనకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, డీజీ నర్సింహారావు, బి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మద్దతు విషయంపై తమ్మినేని సానుకూలంగా స్పందించారన్నారు. ఉద్యోగసంఘాల నాయకుడిగా తనపై వామపక్షాలు అభ్యర్థిని నిలపలేదన్నారు. రాష్ట్రంలో లౌకికవిలువల పరిరక్షణకు సీపీఎం, ఇతర వామపక్షాలు మద్దతునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ నెల 10న జరిగే తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీనిపై ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చించాక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement