రైతుల కోసం కలసి పోరాడుదాం రండి | YS Jagan asks cpi, cpm leaders to support loan waiver issue | Sakshi
Sakshi News home page

రైతుల కోసం కలసి పోరాడుదాం రండి

Published Wed, Jul 23 2014 10:25 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

రైతుల కోసం కలసి పోరాడుదాం రండి - Sakshi

రైతుల కోసం కలసి పోరాడుదాం రండి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఐ, సీపీఎం నాయకులను కోరారు. ఆంధ్రప్రదేశ్ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు  రామకృష్ణ, మధులతో జగన్ మాట్లాడారు.

ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ సీపీ ఆందోళనలను నిర్వహించనుంది. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలపుడు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలో వచ్చాక షరతులు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబంలో ఎన్ని రుణాలున్నా లక్షన్నర వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement