ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చిచ్చుకు కుట్ర
టీఎన్జీవోస్ 70 వసంతాల వేడుకలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ: ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య ఉన్న సత్సంబంధాన్ని చూసి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం రాత్రి హన్మకొండలో టీఎన్జీ వోస్ యూనియన్ 70 వసంతాల వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కడియం మాట్లా డుతూ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వ కంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని, ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్పీకర్ సిరికొండ మధు సూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణ చేయాలని విశ్వాసం టీఎన్జీ వోస్ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు.
మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ స్యలు సీఎం పరిష్కరిస్తారని, ఈ విషయం లో ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడవద్ద న్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావడం, తెలంగాణ పునర్నిర్మాణమే వరంగల్ డిక్లరేషన్ అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడితేనే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దవుతుందన్నారు. ఈ దిశగా మార్చిన 2న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.