'బాబూమోహన్ కు మతిభ్రమించింది' | Bala Raj Comments on MLA Babu Mohan | Sakshi
Sakshi News home page

'బాబూమోహన్ కు మతిభ్రమించింది'

Published Sun, Jul 10 2016 3:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'బాబూమోహన్ కు మతిభ్రమించింది' - Sakshi

'బాబూమోహన్ కు మతిభ్రమించింది'

ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మతిభ్రమించి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అల్లాదుర్గం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాల్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అల్లాదుర్గంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి.

అల్లాదుర్గం మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని ప్రజలు ఆందోళనలు చేపడితే ఎమ్మెల్యే బాబూమోహన్ పనీపాటలేని వారు దీక్షలు చేస్తున్నారని మాట్లాడటంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఆందోళనలు, దీక్షలు చేసే సాధించుకున్న విషయం గుర్తుచేసుకోవాలన్నారు. తెలంగాణ కోసం రాష్ట్రం మొత్త ఆందోళనలు చేస్తుంటే ఒక్క రోజు ఆందోళనలో ఎమ్మెల్యే పాల్గొన లేదని, ఆంధ్ర పార్టీ తెలుగు దేశంలో ఉన్నారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే పదవి చేపట్టి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలన్నారు. దీక్షా శిబిరంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శేషారెడ్డి, కాయిదంపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement