మెదక్లో కాంగ్రెస్ దూకుడు | congress leads in medak district | Sakshi
Sakshi News home page

మెదక్లో కాంగ్రెస్ దూకుడు

Published Mon, May 12 2014 12:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మెదక్లో కాంగ్రెస్ దూకుడు - Sakshi

మెదక్లో కాంగ్రెస్ దూకుడు

మెదక్ : మెదక్ జిల్లా మున్సిపల్‌ ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. మొత్తం నాలుగు మున్సిపాలిటీలు రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నాలుగింటిలో ముందంజలో ఉంది.  సదాశివపేట్‌లో 23 స్థానాలకు కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుంది. సంగారెడ్డిలో 31 స్థానాలకు 11 చోట్ల కాంగ్రెస్ గెలిచింది.

జహీరాబాద్‌లో 24 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. ఆందోల్ నగర పంచాయతీలో 20 స్థానాలకు 13 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మెదక్‌ మున్సిపాలిటీలో 27 స్థానాలకుగాను 11 స్థానాల్లో గెలిచి టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గజ్వేల్ నగర పంచాయతీలో 20 స్థానాలకు 10 చోట్ల గెలిచి టీడీపీ ఆధిక్యతను ప్రదర్శించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement