పేదల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం | poor peoples welfare possible with ysrcp | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం

Published Mon, Apr 14 2014 12:10 AM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM

poor peoples welfare possible with  ysrcp

 రాయికోడ్, న్యూస్‌లైన్: పేద ప్రజల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు అన్నారు. ఆది వారం రాయికోడ్‌లో మండల నాయకులతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, బాబూమోహన్‌లపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు.

అందుబాటులో ఉండని పార్టీలు, నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడు ఉద్యమిం చని బాబూమోహన్‌కు టికెట్ ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ ఉండబోదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందన్నారు. ఈ ఎన్నికల్లో  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అంతకుముందు సింగితం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశమై ఆ తరువాత స్థానిక చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, కేశవ్‌రెడ్డి, దేవదాస్, ఖాజా, శివారెడ్డి, బాబు, పేత్రు పాల్గొన్నారు.

 రూ.350 కోట్ల అభివృద్ధి ఎక్కడ?
 మునిపల్లి: గత ఐదేళ్లలో రూ.350 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గొప్పలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ అందో ల్ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు విమర్శించారు. ఆదివారం ఆయన మండలంలోని బుదేరా చౌరస్తాలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో దళితులను రాజకీయంగా ఎదగకుండా చేసింది దామోదర కాదా? అని ఆయన ప్రశ్నించారు.  సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement