దామోదర్‌పై దయ కలిగేనా?
1. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ మొత్తం అరుుదుగురు పోటీలో ఉన్నారు. సీఎం కావాలని కలలుకంటున్న దామోదర్ టీఆర్‌ఎస్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటించాల్సిన దామోదర్ నియోజకవర్గానికే పరిమితమై సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
2. 2009లో సినీనటుడు పి. బాబూమోహన్‌పై దామోదర్ 2906 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.
3. గె లుపొందితే సీఎం అవుతారని,సింగూరు జలాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తామని హామీ ఇస్తున్నారు.
4. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. ఈనెల 27న సోనియాగాంధీ ఆందోల్ బహిరంగసభ లో పాల్గొన నున్నారు.ఈ అంశాలపైనే దామోదర్ గంపెడు ఆశలతో ఉన్నారు.
5. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం బలంగా ఉండటమే టీఆర్‌ఎస్‌కు అనుకూల అంశం. యువకులు టీఆర్‌ఎస్ వెంట ఉన్నారు. .
6. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరటం, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి మద్దతు ఉండటంతో టీఆర్‌ఎస్ బలం పెరిగింది.
7. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే నవ తెలంగాణ సాధించవచ్చునని బాబూమోహన్ ప్రచారం చేయుడం లాభించే అంశం.
8. వైఎస్సార్ సీపీ అభ్యర్ధి బి. సంజీవరావు ప్రధాన పోటీ ఇస్తున్నారు. స్థానికతను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను ముందుకు తెచ్చారు. క్రిస్టియన్, మైనార్టీలు ఆయనకుఅండగా ఉన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ తరఫున బుర్రి ఎల్లయ్యు పోటీలో ఉన్నారు.