- వైఎస్సార్ సీపీ అందోలు నియోజకవర్గ ఇన్‌చార్జి బి.సంజీవరావు
జోగిపేట: వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి స్థానిక సమస్యలను వివరించినట్లు అందోలు నియోజకవర్గ ఇన్‌చార్జి బి.సంజీవరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కుటుంబాల గూర్చి రాష్ర్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పార్టీ అధ్యక్షుడికి వివరించినట్లు తెలిపారు.
జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై వత్తిడితేవాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. ప్రత్యేకంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంతైనా ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే లబ్ధిదారులకు అందేలా అధికారులపై వత్తిడి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్, మదన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
Published Sat, May 2 2015 12:55 AM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM
Advertisement
Advertisement