కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు దగ్ధం
Published Tue, Jan 31 2017 10:55 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వ్యాన్ దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పాఠశాల యాజమాన‍్యం అంటే గిట్టని వారెవరో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. నష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement