వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. దీంతో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ. జీన్ కారోల్ అత్యాచార ఆరోపణలతో పాటు అనేక లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్‌పై ప్రస్తుతం డోరిస్ వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. (వైట్‌హౌస్‌లో ఒకరికి పాజిటివ్ : నేను ఓకే!)
ది గార్డియన్ కథనం ప్రకారం 1997లో న్యూయార్క్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా ట్రంప్ వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అమీ డోరిస్ ఆరోపించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వీఐపీ సూట్‌లో ఉన్న ట్రంప్. తనపట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, తనపై పట్టు సాధించి, బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని, తన శరీరాన్ని అనుచితంగా తాకారని ఆరోపించారు. అపుడు తన వయసు 24 ఏళ్లు అని, ఆ సమయంలో ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు ఉండొచ్చని ఆమె చెప్పుకొచ్చారు. 2016 లోనే ఈ విషయంపై ముందుకు రావాలని భావించినప్పటికీ, కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే తన టీనేజ్ కవలకుమార్తెలకు రోల్ మోడల్‌గా ఉండేందుకే ఈ వేధింపులపై ప్రపంచానికి తెలిజేయాలని తాజాగా నిర్ణయించుకున్నానని డోరిస్ చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతో చే్స్తున్న ఆరోపణల తప్ప మరొకటి కాదని కొట్టి పారేశారు. (‘హెచ్1బీ’ కేసులో ట్రంప్‌కు ఊరట)
Comments
Please login to add a commentAdd a comment