కుమార్తెపై లైంగిక దాడి, గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి | Father Assaulted On Daughter In Prakasam District | Sakshi
Sakshi News home page

కీచక తండ్రి: ఏడు నెలలుగా కుమార్తెపై లైంగిక దాడి, గర్భం దాల్చిన మైనర్‌

Jul 16 2021 10:03 AM | Updated on Jul 16 2021 1:14 PM

Father Assaulted On Daughter In Prakasam District - Sakshi

  కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురిపై కన్నేశాడు. మద్యం మత్తులో ఏడు నెలలుగా శారీరక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని బాలేశ్వరపురంలో గురువారం వెలుగులోకి వచ్చింది.

బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా):  కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురిపై కన్నేశాడు. మద్యం మత్తులో ఏడు నెలలుగా శారీరక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాలిక (14 ) ఐదు నెలల గర్భిణి. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని బాలేశ్వరపురంలో గురువారం వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఎస్సై మాధవరావు కథనం మేరకు..బేస్తవారిపేట మండలంలోని బాలేశ్వరపురానికి చెందిన ఓ వ్యక్తి (49)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరికి వివాహమైంది. 14 ఏళ్ల కుమార్తెతో కలిసి గ్రామానికి సమీపంలోని శింగరపల్లెలో మామిడి తోటలో కాపలాగా ఉంటున్నాడు. జనవరి నెలలో మామిడి తోట నుంచి గ్రామంలోకి సరుకుల కోసం భార్య వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న తండ్రి కుమార్తెపై లైంగికదాడి చేశాడు.

ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు చెప్పినా.. బయటకు చెబితే చంపేస్తానని అతను బెదిరించడంతో భయపడిన భార్య, కుమార్తెలు నోరుమెదపకుండా ఉండిపోయారు. అప్పటి నుంచి కూతురిని శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో గలిజేరుగుళ్ల వైద్యశాలలో చూపించారు.

బాలిక ఐదు నెలల గర్భిణిగా ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పడంతో ఈ దారుణంవెలుగులోకి వచ్చింది. బాలిక అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టేందుకు కూతురు వెళ్లిందనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ చేసి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement