డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు | Amarin Pharma files patent infringement case against Dr Reddy's Laboratories on lipid lowering drug, Vascepa | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు

Published Mon, May 5 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు

డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు

 హైదరాబాద్: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌పై పేటెంటు ఉల్లంఘన కేసు నమోదైంది. పేటెం టున్న ఔషధమైన వాసెపాకు జనరిక్ వెర్షన్‌ను తీసుకొచ్చే పనిలో రెడ్డీస్ నిమగ్నమైందంటూ డబ్లిన్‌కు చెందిన అమరిన్ ఫార్మా అమెరికా కోర్టును ఆశ్రయించింది. రెడ్డీస్ ఏఎన్‌డీఏ 16 కౌంట్లలో వాసెపా ఔషధాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

 రెడ్డీస్, అనుబంధ కంపెనీ, ఇతర విభాగాలుగానీ ఈ ఔషధం తయారీ, వాడకం, విక్రయం, అమ్మజూపడం, కొనుగోలును శాశ్వతంగా నిషేధించాలని కోర్టుకు విన్నవించింది. హ్యాచ్-వాక్స్‌మన్ యాక్టు కింద అమరిన్ ఫార్మా ఈ దావా వేసింది. శరీరంలో ఒక రకమైన కొవ్వును (ట్రైగ్లిసెరైడ్స్) తగ్గించేందుకు ఈ ఔష దం దోహదం చేస్తుంది. వాసెపా ఔషధం పేటెం ట్లు చాలామటుకు 2030లో ముగియనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement