సాక్షి, హైదరాబాద్: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి హైదరాబాద్‌కు చేరింది. భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా భారత్‌లో సుమారు 2వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నారు. కాగా.. స్పుత్నిక్ టీమ్ వ్యాక్సిన్ ఇప్పటికే 92 శాతం సక్సెస్ సాధించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. (షాకింగ్: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..)
2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్‌డిఐఎఫ్ తెలిపింది. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment