కొత్త కారు ముచ్చట తీరనే లేదు.. | nano car owner died in a accident | Sakshi
Sakshi News home page

కొత్త కారు ముచ్చట తీరనే లేదు..

Published Fri, May 22 2015 11:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

కొత్త కారు ముచ్చట తీరనే లేదు..

కొత్త కారు ముచ్చట తీరనే లేదు..

ఏలూరు: ఓ ఆటో డ్రైవర్ కొత్తగా కొనుకున్న కారు ముచ్చట తీరనే లేదు. అంతలోనే మృత్యువు కారు ప్రమాదం రూపంలో అతడి ప్రాణాలను మింగేసింది. ఏలూరుకు చెందిన మహేశ్ ఇటీవలే కొనుగోలు చేసిన కారులో  పని నిమిత్తం వేరే ప్రాంతానికి బయలుదేరాడు. అతివేగంగా వెళుతున్న ఆ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.

 

ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం పాలగూడెం వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement