
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయం ఎదుట మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు కలకలం సృష్టించింది. సోమవారం నుంచి నానో కారు బీజేపీ కార్యాలయం ఎదుటే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నానో కారులో సూట్‌కేసు ఉంది. దీంతో బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు బీజేపీ నేతలు.
సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్స్ సైతం కారులో తనిఖీలు చేపట్టారు. అయితే, కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. కారులోని సూట్‌కేసులో దుస్తులు తప్పా ఎలాంటి ఇతర వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు పోలీసులు. అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు కారును తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు
Comments
Please login to add a commentAdd a comment