జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్‌–టామ్‌ ‘వారధి’  | F-TAM 'Varadhi' to be screened at Rabindra Bharathi on January 27 | Sakshi
Sakshi News home page

జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్‌–టామ్‌ ‘వారధి’ 

Published Fri, Jan 24 2025 3:50 PM | Last Updated on Fri, Jan 24 2025 4:14 PM

 F-TAM 'Varadhi' to be screened at Rabindra Bharathi on January 27

జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్‌–టామ్‌ ‘వారధి’ 

టీఏఎంసీసీఐ ప్రారంభోత్సవం, లోగో ఆవిష్కరణ కార్యక్రమాలు 

ఎఫ్‌–టామ్‌ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు వెల్లడి 

సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 27న ‘వారధి’కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (ఎఫ్‌–టామ్‌) అధ్యక్షుడు గంజి జగన్‌బాబు తెలిపారు. మూడు రాష్ట్రాల వ్యాపారాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌–మహారాష్ట్ర ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) సంస్థ ప్రారంభోత్సవం, లోగోఆవిష్కరణతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం జరగనుందని వెల్లడించారు. 

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయికుమార్‌ ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ప్రజలందరూ విచ్చేయాలని జగన్‌బాబు కోరారు.   

 

చదవండి : Birthright citizenship : ట్రంప్‌ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్‌ఆర్‌ఐలకు భారీ ఊరట
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నవీడియో!


 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement