
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం(ఫిబ్రవరి11)జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మహేష్ నాగుల్వార్ మృతి చెందారు. మహేష్‌ను ఘటనాస్థలం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందారు.కాగా,ఇటీవలే గడ్చిరోలి ప్రాంతానికి చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.అయినా గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గలేదనడానికి ఈ ఎన్‌కౌంటరే నిదర్శనమన్న వాదన వినిస్తోంది.
మరోవైపు రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 30 మంది దాకా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిందిగా చెప్తున్న హెలికాప్టర్‌లో నుంచి తీసిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment