BOARDER
-
తెలంగాణ సరిహద్దులో ఎన్కౌంటర్..కానిస్టేబుల్ మృతి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు,మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మంగళవారం(ఫిబ్రవరి11)జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మహేష్ నాగుల్వార్ మృతి చెందారు. మహేష్‌ను ఘటనాస్థలం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందారు.కాగా,ఇటీవలే గడ్చిరోలి ప్రాంతానికి చెందిన పలువురు మావోయిస్టు అగ్రనేతలు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.అయినా గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గలేదనడానికి ఈ ఎన్‌కౌంటరే నిదర్శనమన్న వాదన వినిస్తోంది.మరోవైపు రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మంది దాకా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిందిగా చెప్తున్న హెలికాప్టర్లో నుంచి తీసిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. -
బోర్డర్లో పాక్ కాల్పులు.. ధీటుగా స్పందించిన ఆర్మీ
జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం(జూన్28) రాత్రి పాక్‌సైన్యం కాల్పులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.క్రిష్టఘాటి సెక్టార్ వద్ద సరిహద్దు వద్ద భారత్‌వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండానే పాక్ సైన్యం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పులకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చినట్లు సమాచారం. సరిహద్దు వెంట చొరబాటుదారులను పంపే సమయంలో దృష్టిని మరల్చడానికే పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో చొరబాట్లను అడ్డుకోవడానికి సైన్యం అప్రమత్తమైంది. -
కోడ్ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు..
మంచిర్యాల : రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేదుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల కోసం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. జిల్లా సరి హ ద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహ ద్దు ప్రాంతమైన దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద, దండేపల్లి పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభ పె ట్టేందుకు తరలించే వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారీ మాత్రం ముందుగానే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఆన్లైన్లో పాక్ యువతితో ప్రేమ.. ప్రియుడి కోసం సరిహద్దులు దాటి!
సాక్షి, హైదరాబాద్: సౌదీలో ఉంటున్న హైదరాబాద్ అబ్బాయి, పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయి ‘ఆన్లైన్’లో ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. దీంతో అతడు, ఆమెను నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన ప్రేయసిని నేపాల్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే బాధ్యతని తన సోదరుడికి అప్పగించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సరిహద్దు దాటుతూ సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కు మంగళవారం చిక్కారు. పాక్ యువతిని, అహ్మద్ సోదరునితోపాటు వారికి సహకరించిన నేపాల్ వ్యక్తినీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. సినిమా కథను తలపిస్తున్న ప్రేమకథ వివరాలిలా ఉన్నాయి. ప్రేమగా మారిన ‘సోషల్’పరిచయం... పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన అహ్మద్ కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఇతడికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఖాదిజా నూర్ సోషల్‌మీడియాలో పరిచ యమైంది. చాటింగ్, వాయిస్, వీడియోకాల్స్‌తో ఈ ఆన్లైన్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే విషయాన్ని నూర్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే భారతీయుడికిచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. నూర్ ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. ముందుగా ఆమెను హైదరాబాద్ పంపి, తరువాత తానూ వచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. సౌదీలో అహ్మద్ పని చేస్తున్న హోటల్లోనే కొందరు నేపాలీలు పని చేస్తున్నారు. ఏళ్లుగా కలిసుండటంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. నేపాల్ వరకు సోదరుడిని పంపి... నూర్‌ను తమ దేశం మీదుగా హైదరాబాద్ పంపుదామంటూ నేపాలీలు అహ్మద్‌కు సలహా ఇచ్చారు. అక్కడ వారికి సహాయం చేయడానికి జీవన్ అనే నేపాలీని ఏర్పాటు చేశారు. దీంతో అహ్మద్ తన సోదరుడు మహ్మద్‌ను రంగంలోకి దింపాడు. నూర్కోసం ఆర్జూ బాగ్దాదియా పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేయించాడు. దీన్ని తీసుకుని మహ్మద్ గత వారం నేపాల్ చేరుకున్నాడు. నూర్ దుబాయ్ మీదుగా నేపాల్ వచ్చింది. నేపాలీ జీవన్తోసహా ముగ్గురూ ఇండో–నేపాల్ సరిహద్దు బిహార్‌లోని సీతమ్రాహీ జిల్లా బిట్టామోర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు మంగళవారం చేరుకున్నారు. తెల్లవారుజామున అక్కడ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తూ ఎస్ఎస్బీ బలగాల కళ్లల్లో పడ్డారు. నూర్ వద్ద హైదరాబాద్‌కు చెందిన మహిళగా ఆధార్ కార్డు, పాకిస్తాన్ పాస్‌పోర్టు, ఫైసలాబాద్‌లోని జీసీ ఉమెన్ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్నట్లు గుర్తింపుకార్డు, పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు లభించాయి. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. పలు కోణాల్లో సాగుతున్న విచారణ గూఢచర్యం కోసం వస్తుందేమోనని అనుమానించిన పోలీసులు.. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్ఎస్బీ అ«ధికారులు సీతమ్రాహీ పోలీసులకు ముగ్గురినీ అప్పగించారు. సీతమ్రాహీ ఎస్పీ హరికిషోర్ రాయ్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘నూర్ సైకాలజీ స్టూడెంట్. జూలై 29న ఇస్లామాబాద్‌లోని నేపాల్ ఎంబసీకి వెళ్లి నెల రోజులకు టూరిస్ట్ వీసా తీసుకుంది. దీని ద్వారానే దుబాయ్ మీదుగా కాఠ్మాండు చేరుకుంది. ఈమె అరెస్టుకు సంబంధించి పాక్ ఎంబసీకి సమాచారం ఇచ్చాం’అని తెలిపారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ పోలీసులతో కలిసి అహ్మద్, మహ్మద్‌లకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో... ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నాయి. నూర్, మహ్మద్, జీవన్లను విచారించడానికి ఓ బృందం బిహార్ బయలుదేరి వెళ్లింది. -
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవలకాలంలో తమ పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని, పైగా ఆ పేరు ఎవ్వరికి ఉండకూడదని విన్నూతనంగా పెడుతుండటం చూశాం. కానీ ఇక్కడొక జంట తాము భారత్ పాక్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడంతో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు సరిహద్దు(బోర్డర్) అని పేరుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. (చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!) అసలు విషయంలోకెళ్లితే....ఓ పాకిస్తానీ దంపతులు తమకు పుట్టిన మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. అయితే ఆ జంట 97 మంది పాకిస్తానీ పౌరులతో సహా 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఆ పాకిస్తానీ జంట పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్‌లు. ఈ క్రమంలో బాలం రామ్ మాట్లాడుతూ...ఇండో-పాక్ సరిహద్దులో పుట్టినందున మా బాబుకి ఆ పేరు పెట్టాం. నా భార్య నింబు బాయి ఈ నెల డిసెంబర్ 2 న ప్రసవం అయ్యిందని, అంతేకాక తన భార్యకు సాయం చేయడానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు రావడమే కాక వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను లాక్‌డౌన్‌కు ముందు తమ బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారత్‌కు వచ్చాను. అయితే నా వద్ద తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులతో కలిపి సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయాం" అని చెప్పాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అయితే వారికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
సరిహద్దుల్లో పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి : తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవటంపై ఇప్పటికే తెలంగాణ అధికారులతో ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ చర్చలు జరిపారు. న్యాయపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ పరంగా వైద్యం ఎక్కడైనా చేయించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ఆ హక్కును అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించిన సంగతిని ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. తెలంగాణ అధికారుల తీరు బాధాకరమని తెలిపింది. కాగా, తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పోలీసులను వేడుకున్నా లోపలికి వెళ్లనివ్వటం లేదు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. తెలంగాణ పోలీసులపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మధ్యాహ్నం 2:15 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. చదవండి : సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల -
చొరబాటుదారులను కాల్చి చంపిన బీఎస్ఎఫ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలోకి చొరబడాలని ప్రయత్నించిన ఐదుగురును సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టింది. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బోర్డర్ నుంచి భారత్‌లోకి ప్రవేశించడానికి దుండగులు ప్రయత్నించారు. ఇంతవరకు ఇలా ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని ఇంత సంఖ్యలో కాల్చిచంపడం ఇదే ప్రధమం. ఇక దీని గురించి బీఎస్ఎఫ్ అధికారులు మాట్లాడుతూ, ‘103వ బీఎస్ఎఫ్ ట్రూప్ సరిహద్దులో అనుమానాస్పద కదలికలను గుర్తించింది. వారిని దేశంలోకి ప్రవేశించకుండా అక్కడే ఆగమని ఆదేశించగా వారు బీఎస్ఎఫ్ ట్రూప్‌పై కాల్పులు జరిపారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో 5గురు మరణించారు. దుండగులు పొడుగాటి గడ్డి మోపులను అడ్డుపెట్టుకొని దేశంలోకి ప్రవేశించాలని చూశారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 4:45 గంటల ప్రాంతంలో జరిగింది’ అని తెలిపారు. బీఎస్ఎఫ్ అధికారులు వారి వద్ద నుంచి ఒక ఏకే-47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్ -
కరోనా : రాజస్థాన్ కీలక నిర్ణయం
జైపూర్ : కరోనా కేసులు అధికమవుతున్ననేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను వారం రోజుల పాటు మూసి వేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అదికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఎవరూ వేరే ప్రాంతాలకి వెళ్లకుండా, బయటి వ్యక్తులెవరూ రాష్ర్టంలోకి రాకుండా నియంత్రణ విధిస్తారు. నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసి) ఇతరులెవరినీ రాష్ర్టంలోకి ఎవరినీ అనుమతించమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఎల్ లాథర్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (వందేభారత్ మిషన్ ఫేజ్-3 ప్రారంభం ) గడిచిన 24 గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11,300 మంది మరణించారు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దులు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,985 మంది కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 2,76,583 కు చేరుకుంది. (ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్ ) -
సరిహద్దుల్లో పాక్ చొరబాటు యత్నాలు
-
తొలిసారి బోర్డర్ దాటి తిరిగొచ్చిన ఏనుగు
-
వాట్ ఏ డేర్.. బోర్డర్ దాటి తిరిగొచ్చిన ఏనుగు..
బీజింగ్ : ఒక్కోసారి మనుషులు కూడా చేయలేని సాహసాలు జంతువులు చేస్తుంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు షాక్ గురవ్వడం తప్ప ఏం చేయలేము. దేశ సరిహద్దులు దాటడం అంటే ఎంత సాహసంతో కూడిన పనో అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం మాత్రం తనకు చాలా తేలిక అని ఓ ఏనుగు నిరూపించింది. చైనా సరిహద్దును సునూయాసంగా దాటి లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండుగంటల తర్వాత తిరిగి వెనక్కు వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు పలు చర్చలకు దారి తీసింది. శనివారం తెల్లవారు జామున చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు లావోస్‌కు మధ్య ఉన్న సరిహద్దును ఓ ఏనుగు దాటింది. ఆ సమయంలో అధికారులు చూసినప్పటికీ ఏం చేయలేకపోయారు. అయితే, ఆ ఏనుగు వస్తున్న విషయాన్ని మాత్రం సమీప ప్రజలకు తెలిపి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రత్యేకంగా రెండు బృందాలు సిద్ధం చేశారు. అయితే, రెండుగంటలపాటు లావోస్ భూభాగంలో తిరిగిన ఆ ఏనుగు తిరిగి తన దేశం భూసరిహద్దులోకి తిరిగి అదే బోర్డర్ గేటు నుంచి వెనక్కి వచ్చింది. ఇది చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదేదో మార్నింగ్ జాగింగ్ పోయి వచ్చినట్లుందే అని అనుకుంటూ నవ్వుకున్నారు. కాగా, దీనిపై అధికారులు వివరణ ఇస్తూ చలికాలంలో యునాన్ ప్రావిన్స్‌లోని అడవుల్లో సరిగా ఆహారం లభించదని, దాని వల్లే అప్పుడప్పుడు ఇలా జంతువులు ప్రాంతాలు మారుతుంటాయని, అయితే, తొలిసారి మాత్రం ఒక ఏనుగు గేటు దాటి వెళ్లడం తిరిగి వెనక్కి రావడం జరిగిందని తెలిపారు. -
కురుకూరులో దారుణ హత్య
దేవరపల్లి : ఇంటి సరిహద్దు తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలోని దళితవాడలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సరిహద్దు తగాదా ఉంది. వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుకూరు గ్రామంలోని దళితవాడలో పత్తిపాటి శ్రీను (53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య సరిహద్దు తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలకు వి వాహమైంది. సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
కురుకూరులో దారుణ హత్య
దేవరపల్లి : ఇంటి సరిహద్దు తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలోని దళితవాడలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సరిహద్దు తగాదా ఉంది. వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుకూరు గ్రామంలోని దళితవాడలో పత్తిపాటి శ్రీను (53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య సరిహద్దు తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలకు వి వాహమైంది. సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
తల్లీకూతుళ్లపై కత్తితో దాడి
కొవ్వూరు రూరల్ : సరిహద్దు తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పులూరి వరలక్ష్మి, ఆమె కుమార్తె శశిరేఖ కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో గద్దె వెంకట సుబ్బారావు ఇంటివైపున తమ స్థలంలో ఉన్న మందార మొక్కను తొలగిస్తుండగా.. వెంకట సుబ్బారావు వారిని అడ్డుకున్నాడు. దీంతో వివాదం రేగింది. ఆగ్రహానికి గురైన వెంకట సుబ్బారావు తన చేతిలో ఉన్న కత్తితో వరలక్షి్మ తలపైన, ఎడమ భుజంపైన నరికాడు. అడ్డుగా వెళ్లిన వరలక్ష్మి కుమార్తె శశిరేఖను రెండు చేతులపై నరికాడు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కొవ్వూరులో 108 అందుబాటులో లేకపోవడంతో పోలవరం నుంచి ఆ వాహనం వచ్చే సరికి ఆలస్యమైంది. బాధితులు రెండుగంటలపాటు రక్తపు మడుగుల్లో విలవిల్లాడారు. అనంతరం వచ్చిన వాహనం వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
సరిహద్దులో నిరంతర గస్తీ
–ఎస్పీ బ్రహ్మారెడ్డి పాతపట్నం : ఒడిశా సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వెనుక ఉన్న ఒడిశా నేరగాళ్లపై నిఘా పెట్టినట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం పాతపట్నం çసర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చోరీలతో పాటు గుట్కా, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు చేసిన వారు పోలీసులకు చిక్కకుండా కొంతకాలం ఒడిశాలో తిరుగుతున్నారని చెప్పారు. అనంతరం ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును పరిశీలించారు. ఒడిశా నుంచి రాకపోకలు సాగించే వాహనాలను తప్పనిసరిగా తనిఖీచేయాలని ఎస్ఐ సురేష్‌బాబును ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీలు వివేకానంద, సీహెచ్.ఆదినారాయణ, ట్రైనీ ఎస్ఐలు పి.మనోజ్, జె.సురేష్, ఏఎస్ఐ శివాజీరెడ్డి ఉన్నారు. -
సరిహద్దు కేంద్రంగా చీకటి వ్యాపారం
♦ విచ్చలవిడిగా నిషేధిత పదార్థాల తరలింపు ♦ జోరుగా గుట్కాలు, మందు గుండు, నీలి కిరోసిన్, ఇతర నిషాపదార్థాల వ్యాపారం.. ♦ అన్‌బ్రాండెడ్ తినుబండారాలు సైతం...! ఇచ్చాపురం(కంచిలి): ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం పరిసరాలు చీకటి వ్యాపారాలకు కేరాఫ్‌గా మారాయి. రాత్రి వేళ నిషాపదార్థాలను గుట్టుగా జిల్లా అంతటా వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. లారీలతో సరుకును డంప్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జరిపిన దాడిలో గుట్టలుగా బయటపడిన మత్తు పదార్థాలు, తయారీ యంత్రాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేయడం గమనార్హం. తరలించేశారు..! జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం పోలీసులు గుట్కా గొడౌన్లపై దాడి చేశారు. అయితే, దీనికి కొంత సమయం ముందు దాడి విషయం అక్రమార్కులకు తెలియడంతో లారీల్లో కొంత సరకును ఒడిశాకు తరలించినట్టు భోగట్టా. పోలీసులు 5 లారీల సరుకును మాత్రమే పట్టుకోగలిగారు. తర్వాత కొన్ని లారీలు సరకు దాటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటుకల బట్టీల వద్ద రెండు లారీలు పట్టుబడినట్టు సమాచారం. గుట్కా వ్యాపారాన్నంతటినీ కొందరు బడాబాబుల అండతో బరంపురానికి చెందిన ‘పెదబాబు’ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెదబాబును గుట్కా కేసులో ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ పోటీసులు కేసు చార్జిషీట్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పోలీసులు తీసుకునే ప్రతిచర్య ముందుగానే తెలుసుకొన్న పెదబాబు విదేశాలకు పారిపోయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గడచిన 15 రోజుల్లో గుట్కా నిల్వలే రూ.5 కోట్ల విలువైనవి లభ్యమయ్యాయంటే మిగతా వ్యాపారాలు ఇంకెంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గుట్కా నిల్వలు కోసం పోలీసులు జల్లెడపడడంతో సుమారు రూ.కోటి విలువైన శివకాశీ మందుగుండు సామగ్రి 520 ప్యాకెట్టు పట్టుబడింది. అక్రమ వ్యాపారం పెద్దఎత్తున వెలుగు చూడడంతో జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి రంగంలోకి దిగారు. బోర్డర్లోని ట్రాన్స్పోర్టర్లు, లారీ బ్రోకర్ కార్యాలయాలు, గొడౌన్ నిర్వాహకులతో సమావేశం పెట్టి అక్రమ వ్యాపారాలు నిర్మూలనకు సహకరించాలని కోరారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచ్చలవిడిగా నీలికిరోసిన్ విక్రయం.. చౌకధరల దుకాణాల్లో విక్రయించే నీలికిరోసిన్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. లారీలకు డీజిల్‌కు బదులుగా నీలి కిరోసిన్‌ను వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. సరిహద్దులోని ఓ ఖాళీ గొడౌన్లో ఓ పార్టీకి చెందిన కార్యకర్త నేతల అండతో కిరోసిన్ మాఫియాను యథేచ్ఛగా సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పిల్లలు తినే తినుబండారాలు కూడా చాలా వరకు అన్‌బ్రాండెడ్, రెండో క్వాలిటీవి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలతోపాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. వివిధ రకాల బిస్కెట్లు, కుర్కురే పేరుతో రెండో రకం క్వాలిటీ సరకు ఇచ్ఛాపురం కేంద్రంగా రవాణా జరుగుతోంది. ఒడిశా పరిధిలోని సముద్ర తీర ప్రాంతం నుంచి నాటుసారా వ్యాపారం కూడా గుట్టుగా సాగుతోంది. అక్రమ వ్యాపారాలన్నీ ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లోని వివిధ రోడ్డు మార్గాల ద్వారా సాగుతున్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల ఉన్నతస్థాయి యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప ఇక్కడ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదని స్థానికుల మాట. -
'త్వరలోనే మొత్తం కంచె వేసేస్తాం'
అశోక్ నగర్(పశ్చిమ బెంగాల్): త్వరలోనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచెను పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బంగ్లా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబాట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ పని వేగవంతచేసేందుకు ప్రణాళికను పూర్తిచేస్తున్నామని చెప్పారు. గురువారం బెంగాల్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిలీ ఇండియా కరెన్సీని, మత్తుపదార్థాల రవాణాను, అక్రమ చొరబాట్లను తగ్గించడంలో భారత్‌కు సహకరించాలని తాము బంగ్లాదేశ్‌ను కోరినట్లు చెప్పారు. భారత్-బంగ్లా సరిహద్దులో కేవలం ఫెన్సింగ్ మాత్రమే కాకుండా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. తాము బంగ్లాదేశ్ తో ఎంతమంచి సంబంధాలు నెరుపుతామో మున్ముందు మరింత చూస్తారని, ఇప్పటికే సరిహద్దు వెంట జరుగుతున్న అక్రమాలను నిలువరించేందుకు బంగ్లాదేశ్ భారత్ కు ఎంతో సహాయం చేస్తుందని, ఈ ఒక్క విషయం భారత దౌత్య విధానానికి నిదర్శనం అని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన మైనారిటీలకు ఇప్పటి వరకు సామాజిక భద్రత లేదని, త్వరలోనే వారికి భారత పౌరసత్వం ఇచ్చే పనిప్రారంభిస్తామని చెప్పారు. -
మళ్లీ సరిహద్దు మీరిన చైనా
లేహ్: సరిహద్దును చైనా మరోసారి అతిక్రమించింది. చైనా జవాన్లు ఇటీవల రెండు దఫాలుగా లడఖ్‌లోని ఎగువ ప్రాతం పాన్‌గాంగ్ సరస్సు వద్ద భారత జలాల్లోకి చొచ్చుకువచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలోని భూ మార్గంలో 5 కి.మీ మేర భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నాయి. చైనా దళాలు రెండు పడవల్లో అక్టోబర్ 22వ తేదీన చొరబడినట్లు వెల్లడించాయి. వారి కదలికలను గుర్తించి అప్రమత్తమైన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు వాస్తవాధీన రేఖ వద్ద అడ్డుకున్నట్లు వెల్లడించాయి. కొండ ప్రాంతంలో కూడా చైనా దళాలను భారత బలగాలు నిరోధించాయి. దీంతో చైనా బలగాలు వెనుతిరిగాయి. రెండు ప్రాంతాల నుంచి ఒకేసారి చొరబడటం ద్వారా భారత్ బలగాలపై మానసికంగా ఒత్తిడి పెంచాలని చైనా సైన్యం ఎత్తుగడ వేసినట్లు భావిస్తున్నారు. చైనా గస్తీ దళాలు తరచూ ఈ సరస్సు వద్ద పహరా కాస్తున్నాయి. -
ఖమ్మం - చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్
-
బోర్డర్లో రంజాన్