సరిహద్దులో నిరంతర గస్తీ
Published Sat, Jul 30 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
–ఎస్పీ బ్రహ్మారెడ్డి
పాతపట్నం : ఒడిశా సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వెనుక ఉన్న ఒడిశా నేరగాళ్లపై నిఘా పెట్టినట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం పాతపట్నం çసర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చోరీలతో పాటు గుట్కా, గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఆంధ్రా ప్రాంతాల్లో నేరాలు చేసిన వారు పోలీసులకు చిక్కకుండా కొంతకాలం ఒడిశాలో తిరుగుతున్నారని చెప్పారు. అనంతరం ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును పరిశీలించారు. ఒడిశా నుంచి రాకపోకలు సాగించే వాహనాలను తప్పనిసరిగా తనిఖీచేయాలని ఎస్‌ఐ సురేష్‌బాబును ఎస్పీ ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీలు వివేకానంద, సీహెచ్.ఆదినారాయణ, ట్రైనీ ఎస్‌ఐలు పి.మనోజ్, జె.సురేష్, ఏఎస్‌ఐ శివాజీరెడ్డి ఉన్నారు.
Advertisement