కురుకూరులో దారుణ హత్య
కురుకూరులో దారుణ హత్య
Published Sat, Mar 18 2017 11:06 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
దేవరపల్లి : ఇంటి సరిహద్దు తగాదా నిండు ప్రాణాన్ని బలిగొంది. దేవరపల్లి మండలం కురుకూరు గ్రామంలోని దళితవాడలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సరిహద్దు తగాదా ఉంది. వివాదం తారాస్థాయికి చేరడంతో శనివారం ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుకూరు గ్రామంలోని దళితవాడలో పత్తిపాటి శ్రీను (53), యంగల సత్యనారాయణ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య సరిహద్దు తగాదా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన సత్యనారాయణ కత్తితో శ్రీనుపై దాడి చేశాడు. మెడపై బలంగా నరకడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలకు వి వాహమైంది. సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై పి.వాసు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీను కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.
Advertisement
Advertisement