జైపూర్ : కరోనా కేసులు అధికమవుతున్ననేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను వారం రోజుల పాటు మూసి వేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం అదికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఎవరూ వేరే ప్రాంతాలకి వెళ్లకుండా, బయటి వ్యక్తులెవరూ రాష్ర్టంలోకి రాకుండా నియంత్రణ విధిస్తారు. నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసి) ఇతరులెవరినీ రాష్ర్టంలోకి ఎవరినీ అనుమతించమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంఎల్ లాథర్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (వందేభారత్ మిషన్ ఫేజ్-3 ప్రారంభం )
గడిచిన 24 గంటల్లో రాజస్థాన్‌లో కొత్తగా 123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 11,300 మంది మరణించారు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దులు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,985 మంది కొత్త కరోనా కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 2,76,583 కు చేరుకుంది.
(ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్ )
Comments
Please login to add a commentAdd a comment