Toyota C Plus Pod Electric Car Price And Specifications In Telugu- Sakshi
Sakshi News home page

Toyota: నానో కారు కంటే చిన్న కారును లాంచ్‌ చేసిన టయోటా..! ధర ఎంతంటే..?

Published Thu, Dec 23 2021 8:02 PM | Last Updated on Fri, Dec 24 2021 8:41 AM

Toyota Two-Seater Electric Car Price In India - Sakshi

ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. పరిమాణం, పార్కింగ్‌ స్థలం, రేంజ్‌ వీటన్నింటీని దృష్టిలో ఉంచుకొని టయోటా సీప్లస్‌ పాడ్‌ (C+pod) కారును లాంచ్‌ చేసింది. ఈ కారు నానో కారు కంటే చిన్నగా ఉండడం విశేషం. 

సీ+పాడ్‌ ప్రత్యేకతలు ఇవే..!
నగరాల్లోని ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని టయోటా గత ఏడాది డిసెంబర్‌లోనే జపాన్‌లో సీ+పాడ్‌ను ఆవిష్కరించగా...ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ కారు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టయోటా సీ+పాడ్‌ ఎలక్ట్రిక్‌ కారులో రెండు  సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారు పూర్తిగా బ్యాటరీ అపరేటెడ్‌.


త్రీటోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో రానుంది. సీ+పాడ్ 9.06 kWh లిథియం అయాన్ బ్యాటరీను అమర్చారు. ఈ కారు దాదాపు 150 కిమీ రేంజ్‌ను ఇవ్వనుంది. గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. స్టైలింగ్ పరంగా, టయోటా సీ+పాడ్ ఎల్‌ఈడీ హెడ్ లైట్స్‌, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లతో రానుంది. ఈ కారు బరువును తగ్గించేందుకుగాను బాహ్య ప్యానెల్‌లను పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారు చేశారు.


 

ధర ఎంతంటే..!
టయోటా సీ+పాడ్‌ ఎక్స్‌, జీ అనే రెండు వేరియంట్లలో రానుంది. ఎక్స్‌ ట్రిమ్ ధర 1.65 మిలియన్ యెన్ (సుమారు రూ.11.75 లక్షలు)గా ఉండగా, జీ ట్రిమ్ ధర 1.71 మిలియన్ యెన్ (సుమారు రూ. 12.15 లక్షలు)గా ఉంది. 



చదవండి: అదిరే లుక్స్‌, హై రేసింగ్‌ పర్ఫార్మెన్స్‌తో నయా టీవీఎస్‌ అపాచీ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌! ధర ఎంతంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement