
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్‌కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు.
దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్‌ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment