సాక్షి, ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం తాజాగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఈ ప్రాంతంలో కోవిడ్ సోకి ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత ఇరుకు ప్రాంతమైన ధారావిలో కరోనాను కట్టడి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్‌డౌన్ ఉపసంహరించాక వైరస్ విజృంభణను ఏవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుందో చూడాలి.
కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 9915 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 432 మంది మరణించారు. కోవిడ్-19 బారిన పడిన వారిలో 1,593 మంది కోలుకున్నారు. ముంబై మహానగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి పెరిగింది. కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు 1074 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment