ముంబై : కరోనా వైరస్ ముంబై పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఇప్పటికే 100కి పైగా పోలీసులు ఈ వైరస్ భారిన పడ్డారు. తాజాగా వడాలా పోలీసు స్టేషన్ పరిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ సోకింది. గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో ముంబైలోని గురునానక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక వీరి కుటుంసభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. వడాలా పోలిస్ స్టేషన్ పరిధిలో మెత్తం 7రెడ్ జోన్లు ఉన్నాయని, వీటిలోనే 9 మంది పోలీస్ కానిస్టేబుల్స్ విధులు నిర్వహించడంతో కరోనా సోకిందని అనుమానిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. (ముంబై పోలీసులకు అక్షయ్ విరాళం)
ఇక ముంబైలోని ధారావిలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో గురువారం ఒక్కరోజే 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఒక్క ధారావి లోనే కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత రెండు రోజుల్లోనే ధారావి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుగురు పోలీసులకి కరోనా సోకింది. ఇప్పటివరకు నగరంలో ముగ్గురు పోలీసులు వైరస్ ధాటికి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన పోలీసులు ఇళ్లలోనే ఉండాలని నగర పోలీసు చీఫ్ పరంబిర్ సింగ్ ఆదేశించారు. (‘ధారావి’లో కరోనా విజృంభణ)
Comments
Please login to add a commentAdd a comment