
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్ విజృంభణపై ఆందోళన వ్యక్తమవుతోంది. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్-19 రోగుల సంఖ్య 214కు చేరకుంది. ధారావిలో గురువారం 25 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.
కరోనా మహమ్మారి బారినపడి ఈ ప్రాంతంలో 13 మంది మరణించారని బీఎంసీ అధికారులు తెలిపారు. ధారావిలోని కుట్టినగర్, మతుంగ లేబర్ క్యాంప్, ఆజాద్ నగర్, చమదబజార్, ముకుంద్ నగర్, కళ్యాణ్‌వాడి వంటి పలు ప్రాంతాల్లో తాజా కేసులు గుర్తించామని చెప్పారు. ముంబైలోనే అత్యంత ఇరుకైన ప్రాంతమైన ధారావిలో వైరస్ వ్యాప్తి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment