ముంబై: కరోనా వలస కార్మికులను ఆగం చేసింది. ఉన్న చోట తిండి లేక.. సొంత ఊరుకు వెళ్లేందుకు వీలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మీకుల కోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాంతో వేలాది మంది వలస కార్మీకులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరంతా కరోనా విజృంభిస్తోన్న ధారవి, కుర్లా ప్రాంతంలో నివసిస్తున్నారు.
మహారాష్ట్రలో దాదాపు 5లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వీరంతా నిర్మాణ రంగం, ఇటుకల తయారీ వంటి పరిశ్రమల్లో పనుల చేయడం కోసం వచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంతో ప్రస్తుతం వీరు సొంత ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు వలస కూలీలు మాట్లడుతూ.. ‘ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బస్సులు ఏర్పాటు చేయలేదు. శ్రామిక్ రైళ్ల కోసం ఈ నెల 5న రిజిష్టర్ చేసుకుంటే.. ఈ రోజు ప్రయాణానికి కుదిరింది. క్షేమంగా ఇంటికి చేరితే చాలు.. ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం.. మళ్లీ ముంబై రాం’ అన్నారు.(లాక్‌డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు)
మరి కొందరు మాత్రం ‘ముంబై నగరం మాకు ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధి కల్పించింది. పరిస్థితులు బాగాలేక ఇప్పుడు వెళ్లి పోతున్నాం. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అప్పుడు తిరిగి వస్తా’మన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. (కరోనా వైరస్: సేఫ్ జోన్‌లో గిరిజనం)
Comments
Please login to add a commentAdd a comment