
ముంబై : ముంబైలోని ధారావిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ధారావికి చెందిన మహ్మద్ హోజైఫ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు డోరులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్‌మెంట్‌లో శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్‌కు గ్రిల్స్‌తో పాటు డోర్ కూడా ఉంది.
అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకోవడంతో షేక్‌తో మినహా మిగతా పిల్లలు బయటికి వెళ్లిపోయారు. అందరికంటే చివర వచ్చిన షేక్ బయటికి వచ్చి లిఫ్టు గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉండిపోయిన జోహైఫ్ షేక్‌కు బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు. ఈలోగా మరొకరు లిఫ్టు బటన్ నొక్కేయడంతో కిందకు కదిలింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉన్న బాలుడు లిఫ్టు గ్రిల్స్‌లో నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.
Comments
Please login to add a commentAdd a comment