
ముంబై: శివసేన బీజేపీతో ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ముంబైలోని వివాదాస్పదమైన మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు పనులును ప్రారంభిస్తోంది ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం. దీంతో మాజీ మంత్రి ఆదిత్య థాక్రే మాపై ఉన్న ద్వేషాన్ని ముంబైపై చూపించొద్దు అంటూ అభ్యర్థించారు. మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పచ్చని అటవీ ప్రాంతన్ని నాశనం చేయవద్దని కోరారు. ఆరే అనే అటవీ ప్రాంతంలో ఈ మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది.
అయితే ఇది సుమారు 800ల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతం. చుట్టు పక్కల చిరుతలు వంటి ఇతర జీవ జాతులు సంచరిస్తూ ఉండే ఆహ్లదభరితమైన ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయవద్దని థాక్రే విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ విషయమై పర్యావరణ కార్యకర్తలు భారీ నిరసనలు చేపట్టిన సంగతిని సైతం ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మెట్రో కార్ షెడ్ కోసం గుర్తించిన ప్రాంతం జీవవైవిధ్యం లేదా అటవీ భూమిగా వర్గీకరించబడలేదని, మెట్రో కార్బన్ని తగ్గిస్తుందంటూ వాదించారు.
ఆ తర్వాత నిరసనకారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయించింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టుకు వెళ్లింది. పైగా ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. అధికార పగ్గాలు చేపట్టంగానే ఏక్‌నాథ్ షిండే కక్ష్య సాధింపు చర్యలు మొదలు పెట్టారనే చెప్పాలి. అంతేకాదు ఏక్‌నాథ్ షిండే అధికారం చేపట్టిన వెంటనే ఆగిపోయిన ముంబై మెట్రో పనులను తిరిగి ప్రారంభమవ్వడం విశేషం.
(చదవండి: మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్)
Comments
Please login to add a commentAdd a comment