అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు | BJP MLA Nitesh Rane Alleges Aaditya Thackeray | Sakshi
Sakshi News home page

అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు

Published Sun, Apr 7 2024 9:01 PM | Last Updated on Sun, Apr 7 2024 9:12 PM

BJP MLA Nitesh Rane Alleges Aaditya Thackeray - Sakshi

ముంబై : ముంబై బీజేపీ ఎమ్మెల్యే నితీష్‌ రాణే శివసేన నేత, మాజీ ​​​కేబినేట్‌ మంత్రి ఆదిత్య థాకరేపై విమర్శలు చేశారు. ఓ మహిళను వేధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఆదిత్య ఠాక్రే రక్షణ కల్పిస్తున్నారని రాణే ఆరోపించారు.

రాణే మాట్లాడుతూ, ‘వార్డ్ నంబర్ 106లో యూబీటీ శివసేన నేత అమోల్ సంసారే అనే వ్యక్తి ఆస్తి కోసం మహిళలను వేధించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం బైయిల్‌పై ఉన్న ఆయన ఆదిత్య ఠాక్రేని కలిశారని అన్నారు. దీని బట్టి మహిళని హింసించిన అమోల్ సన్సారేకు ఆదిత్య ఠాక్రే మద్దతు పలుకుతున్నట్లే కాదా అని రాణే ప్రశ్నించారు. 

కాగా, నితీష్ రాణే యూబీటీ నాయకులపై విమర్శలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. ఉద్దవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పేర్లను ప్రస్తావించకుండానే కోవిడ్‌-19 కాలంలో జరిగిన అన్నీ కుంభకోణాల వెనుక ఉన్నవారు త్వరలో కటకటాల వెనుకకు వస్తారు అని వ్యాఖ్యానించారు.

అందుకు యూబీటీ నేత సంజయ్ రౌత్ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈడీ, సీబీఐ మూసివేసిన కేసుల్ని తిరిగి విచారణ జరిపిస్తాం. కాబట్టి అనవసర రాద్ధాంతం చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement