సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తనదైన శైలిలో బడ్జెట్ ప్రసంగంలో దూసుకుపోతున్నారు. తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతో సభలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేంద్ర బడ్జెట్ 2020 లో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేసినట్టు చెప్పారు. బడ్జెట్ థీమ్స్‌లో ఆకాంక్ష, ఆర్థికాభివృద్ది, సంక్షేమం ఇవే బడ్జెట్ థీమ్స్ అని ఆర్థికమంత్రి వెల్లడించారు. మొదటి ఆకాంక్షలో భాగంగా ... నైపుణ్యాలు, విద్య, వ్యవసాయం ఉంటాయన్నారు. ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధికి 16 అంశాలతో కార్యచరణ ప్రణాళికలను ప్రకటించారు. తద్వారా అత్యాధునిక వ్యవసాయానిక తోడ్పాటు నిస్తాంమని తెలిపారు.
(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తామనీ, 6.11 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యాన్ని అందిస్తామని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమన్నారు. వ్యవసాయానికి సంబంధి 3 కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుక చర్యలు తీసుకుంటామని తెలిపారు.నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునురుద్దరిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయ వస్తువులను దేశవ్యాప్తంగా త్వరగా రవాణా చేయడానికి వీలుగా కిసాన్ రైలును ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్)
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 2.83 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ది రంగాలు రూ. 1.23 లక్షల కోట్లు,
- స్వచ్ఛభారత్‌కు రూ.12300 కోట్లు
- సముద్ర మత్స్య వనరుల అభివృద్ధి, నిర్వహణ మరియు పరిరక్షణకు ముసాయిదా
- 2022-23 నాటికి చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు పెంచనున్నాం.
- ఫిషరీస్ విస్తరణ పనుల్లో సాగర్ మిత్రాస్ పేరుతో గ్రామీణ యువతకు ప్రోత్సాహం
- వ్యవసాయ మార్కెట్లను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉంది.
- వ్యవసాయాన్ని మరింత పోటీగా మార్చాల్సిన అవసరం ఉంది, వ్యవసాయ-ఆధారిత కార్యకలాపాలను అందిపుచ్చుకోవాలి. స్థిరమైన పంట పద్ధతులకు మరింత సాంకేతిక పరిజ్ఞానం అవసరం
- బంజరు / తడి భూములలో సౌర యూనిట్లను ఏర్పాటు చేయడానికి రైతులను అనుమతి, గ్రిడ్లకు విద్యుత్ సరఫరా
- 100 నీటి పీడన జిల్లాలకు సమగ్ర చర్యలు ప్రతిపాదన
Comments
Please login to add a commentAdd a comment