దేశ స్థూల ఉత్పత్తి 10 శాతం పెరుగుదలతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అయితే 10 శాతం పెరుగుదల అనేది ప్రశ్నార్థకంగా ఉందని బుగ్గన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని బుగ్గన స్పష్టం చేశారు.