న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం 16 అంశాలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేశామని, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపడం, ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా తగిన మౌలిక సదుపాయాలు కలి్పంచడం ద్వారా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రూ.15 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అందులో వ్యవసాయ రంగానికి రూ.1.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రుణ పరిమితి రూ.12 లక్షల కోట్లు మాత్రమే కాగా.. ఈ ఏడాది లక్ష్యం రూ.13.5 లక్షల కోట్లు. వ్యవసాయ, అనుబంధ, సాగునీటి వ్యవస్థల కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారని, గ్రామీణాభివృద్ధి కోసం మరో రూ.1.23 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు.
ప్రత్యామ్నాయ మార్గాలివీ..
‘రైతులను విద్యుదుత్పత్తిదారులుగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కార్యక్రమం కింద 20 లక్షల మంది రైతులు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తాం. మరో 15 లక్షల మంది రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ పంపుసెట్ల నుంచి నెట్‌మీటరింగ్ పద్ధతి ద్వారా జాతీయ గ్రిడ్‌కు విద్యుత్తు సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తాం. తద్వారా రైతులు కొంత అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా.. బీడు భూముల్లో, వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో సోలార్ విద్యుదుత్పత్తి చేసుకునేందుకూ రైతులకు అవకాశం కలి్పస్తాం’అని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ భూమి లీజింగ్, మార్కెటింగ్, కాంట్రాక్ట్ ఫారి్మంగ్ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సాగునీటి లభ్యతపై ఒత్తిడి ఉన్న వంద జిల్లాలను గుర్తించి సమస్య పరిష్కారానికి సమగ్రమైన ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. సాగుకు తక్కువ నీరు, ఎరువులు, రసాయనాలను వాడేలా రైతులను ప్రోత్సహిస్తామని తద్వారా రాయితీల కోసం విచ్చలవిడిగా కృత్రిమ రసాయనాలను వాడే పరిస్థితి తొలగుతుందని మంత్రి చెప్పారు.
పీఎం–కిసాన్ యోజనకు తగ్గిన కేటాయింపులు
రైతులకు ఏటా మూడు దశలుగా మొత్తం రూ.6 వేలు చెల్లించేందుకు ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకం కోసం దాదాపు రూ.75 వేల కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం అమల్లో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో రూ.54,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే కేటాయింపులు తగ్గినా రానున్న ఆర్థిక సంవత్సరపు అంచనాలను మాత్రం రూ.75 వేల కోట్లుగానే పెట్టడం గమనార్హం. గతేడాది ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 8 కోట్ల మంది రైతులకు రూ.43,000 కోట్లు పంపిణీ చేయగా.. పశి్చమ బెంగాల్‌లో ఈ పథకాన్ని అమలు చేయలేదు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో రైతులకు సంబంధించి సరైన సమాచారం లేదని, ఫలితంగా ఈ ఏడాది ఈ పథకం సవరించిన అంచనాలను కూడా
కేంద్రం తగ్గించింది. ఈ పథకం లబి్ధదారుల సంఖ్య గతంలో 14.5 కోట్లు కాగా.. తాజా అంచనాల ప్రకారం 14 కోట్ల మందికి మాత్రమే
లబ్ధి చేకూరనుంది.
మత్స్య ఉత్పత్తులపైనా ప్రత్యేక శ్రద్ధ..
2020 – 23 మధ్యకాలంలో మత్స్య ఉత్పత్తులను 200 లక్షల టన్నులకు పెంచేందుకు, 2024–25 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన మత్స్య సంపదను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీలి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా నాచు, సముద్రపు కలుపు, ప్రత్యేక నిర్మాణాల్లో చేపల పెంపకాలకూ ఊతమిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 3,477 మంది సాగర్ మిత్రలు, 500 ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా సముద్ర, జల ఉత్పత్తుల సమర్థ మార్కెటింగ్, గ్రామీణ యువతకు ఉపాధికల్పన సాధ్యమవుతుందని వివరించారు. సముద్ర మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు, పరిరక్షించేందుకు, నియంత్రించేందుకు కేంద్రం కొన్ని నిబంధనలను సిద్ధం చేస్తోందని తెలిపారు. పాడిపశువులకు వచ్చే గాలికుంటుతో పాటు గొర్రెలు, మేకలకు వచ్చే పీపీఆర్ వంటి వ్యాధులను 2025కల్లా దేశంలో లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పశుగ్రాసం పెంపకం పనులకూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మహిళా సంఘాలకు ‘ధాన్యలక్ష్మి
గ్రామీణ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాల నిల్వకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కలి్పస్తామని, తద్వారా మహిళలను ధనలకు‡్ష్మలుగా మాత్రమే కాకుండా ధాన్యలకు‡్ష్మలుగానూ గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా, నాబార్డ్ సంస్థల ద్వారా శీతల గిడ్డంగుల ఏర్పాటుకు రుణాలు అందజేస్తామని తెలిపారు. జాతీయ గిడ్డంగుల సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న భూముల్లో గిడ్డంగుల నిర్మాణం చేపడతామని, నాబార్డ్‌తో 162 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగులను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తామని వెల్లడించారు. విమానాల ద్వారా పంట ఉత్పత్తులను దూర ప్రాంతాలకు చేరవేసేందుకు ‘కృషి ఉడాన్’పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో శీతలీకరణ వ్యవస్థలున్న ‘కిసాన్ రైళ్ల’ను నిర్మించి తొందరగా పాడైపోయే ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. ఉద్యానవన పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకూ ప్రయతి్నస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రాల్లో ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’అన్న భావనను పెంపొందించేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తగినంత వ్యవ‘సాయం’
కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మధ్యతరగతి మహిళలకు ఈ బడ్జెట్ ఊరటనిస్తుందని, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించిందని తోమర్ తెలిపారు. వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment