న్యూఢిల్లీ : కేంద్ర నిధులతోనే తెలంగాణ గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠదామాలు నిర్మిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె ఢిల్లీలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర పథకాల అమలు కోసం రాష్ట్రానికి రావల్సిన నిధులు కేంద్రం నుంచి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రైతులను రెచ్చగొడుతూ అనవసర రాద్దాంతం చేస్తున్నాయని డీకే అరుణ అగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎనలేని కృషిచేస్తుందని అరుణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment