సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 680 పాయింట్లు కుప్పకూలి 40043 వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 11748 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ మాత్రమే స్వల్పంగా లాభపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కారణంగా శనివారం సాధారణ సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో బలహీనంగా ఉన్న మార్కెట్లు తరువాత దాదాపు 120 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటినుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్, ఆటో రంగం పై జీఎస్‌టీ తగ్గింపు లాంటి ఆశాజనక వార్తలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. (మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...)
Comments
Please login to add a commentAdd a comment