సాక్షి, న్యూఢిల్లీ: అన్ని వర్గాల కొనుగోలు శక్తి పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రెండోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ... 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం పరిపాలనలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా జీఎస్టీ అమలైందని పేర్కొన్నారు. ఇదొక చరిత్రాత్మక సంస్కరణ అన్నారు. అదే విధంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశామన్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక భారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయన్న నిర్మల... అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని తెలిపారు.14 కోట్ల జీఎస్టీ రిటర్న్స్ నమోదైనట్లు వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ నమోదు మరింత సరళతరం కానుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అందడం లేదని.. రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు వెళ్తున్నాయని.. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.(బడ్జెట్ 2020: బయోకాన్ చీఫ్ ఆసక్తికర ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment