ఆర్థిక సర్వే : కొన్ని ముఖ్య విషయాలు | Budget 2020 Economic Survey Predicts Growth Rate To Be 6 To 6.5 In 2020-21 | Sakshi
Sakshi News home page

ఆర్థిక సర్వే : కొన్ని ముఖ్య విషయాలు

Published Fri, Jan 31 2020 6:54 PM | Last Updated on Fri, Jan 31 2020 7:11 PM

Budget 2020 Economic Survey Predicts Growth Rate To Be 6 To 6.5 In 2020-21 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సూచించే ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6- 6.5 శాతంగా నమోదు కావొచ్చని సర్వే అంచనా వేసింది. చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే విడుదలయిన నేపథ్యంలో.. కొన్ని ముఖ్య విషయాలు

  • వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుండి ప్రారంభమయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సడలించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది
  • ప్రభుత్వం ఆహారానికి సంబంధించిన సబ్సిడీలను హేతుబద్దీకరించాలని సర్వే అభిప్రాయపడింది.
  • ప్రభుత్వం ధరలను కట్టడి చేయడానికి ఆహార ధాన్యాలను మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు పంపిణి చేసిందని సర్వే తెలిపింది. గత ఏడాది (2019-20) బడ్జెట్‌లో ఆహార రాయితీల కోసం ప్రభుత్వం రూ .1.84 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని సర్వే తెలిపింది.
  • ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుందని, పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోనుందని తెలిపారు.
  • మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసిందుకు ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
  • రియల్‌ ఎస్టెట్‌ కంపెనీలు అమ్ముడుపోని ఇళ్ల ధరలను తగ్గించాలని సర్వే తెలిపింది. ఇళ్ల ధరలను తగ్గించడం ద్వారా అమ్మకాలు పెరిగి బ్యాంకులలో తీసుకున్న రుణాలను చెల్లిస్తారని సర్వే తెలిపింది.
  • ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనం దేశ ఎగుమతులపై ప్రభావం చూపించిందని సర్వే తెలిపింది.
  • దశాబ్దకాలంగా ఎన్నడూ లేని విధంగా జులై సెప్టెంబర్‌లో తక్కువ వృద్ధి రేటు (4.5శాతం) నమోదయిందని, చదువు పూర్తయి లక్షలాది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపింది.
  • ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి(2019-20) వృద్ధి రేటు 5 శాతానికి అంచనా వేసినా అంతర్జాతీయ మందగమనం కారణంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని తెలిపింది. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement