కేంద్ర బడ్జెట్ 2025ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను విడుదల చేశారు. ఇది భారతదేశ ఆర్థిక పనితీరుతోపాటు భవిష్యత్తు పరిణామాలకు పునాది వేసింది. 2026లో 3వ తరగతి పూర్తి చేసుకునే ప్రతి చిన్నారికి సమగ్ర అక్షరాస్యత కల్పించేందుకు ‘నిపుణ్ భారత్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఈ సర్వే హైలైట్ చేసింది.
నిపుణ్ భారత్ ఇనిషియేటివ్
కేంద్ర మంత్రిత్వశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ నిపుణ్ భారత్ ఇనిషియేటివ్‌పై చర్చించారు. 2026 నాటికి 3వ తరగతి పూర్తి చేసుకునే చిన్నారులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా బేసిక్ అక్షరాస్యత, సంఖ్యలపై పూర్తి అవగాహన కల్పించేలా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. విద్యా సవాళ్లను పరిష్కరించడంలో, దేశవ్యాప్తంగా లెర్నింగ్ స్కిల్స్‌ను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన నిర్దిష్ట కార్యక్రమాలను సీఈఏ హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండబోయే కొన్ని కీలకాంశాలు కింది విధంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు
ఉపాధ్యాయ శిక్షణ: బేసిక్ నైపుణ్యాలను సమర్థవంతంగా విద్యార్థులకు అందించడానికి ఉపాధ్యాయులకు విస్తృతమైన శిక్షణను అందించడం.
పాఠ్యప్రణాళిక రూపకల్పన: ప్రాథమిక దశ నుంచే అక్షరాస్యత, సంఖ్యలపై నైపుణ్యానికి ప్రాధాన్యమిచ్చే పాఠ్యప్రణాళికను రూపొందించి అమలు చేయడం.
సమాజాన్ని భాగస్వామ్యం చేయడం: పిల్లల అభ్యసనకు మద్దతు ఇవ్వడానికి విద్యా ప్రక్రియలో తల్లిదండ్రులు, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం.
మానిటరింగ్ అండ్ అసెస్‌మెంట్: బేసిక్ నైపుణ్యాల్లో విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడానికి, వాటిని అంచనా వేయడానికి బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
Comments
Please login to add a commentAdd a comment