
కేంద్ర బడ్జెట్‌కు ముందు శుక్రవారం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధిని నమోదు చేసిందన్నారు. దాంతో వరుసగా మూడో ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేసినట్లయింది.
ఆర్థిక సర్వే 2026 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 6.3-6.8% అంచనా వేసింది. ఇది అంతకుముందు సంవత్సరం వృద్ధి కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడంలో విధానకర్తలు కీలక పాత్ర పోషించారని ఆర్థిక సర్వే తెలిపింది. సవాలుతో కూడిన అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధిని కొనసాగించాలంటే గణనీయమైన ప్రయత్నాలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.
ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా వంటి కీలక రంగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సవాళ్లను ఎదుర్కొంటాయని అంచనా వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం, లక్‌పతి దీదీ పథకం, ఇండియా ఏఐ మిషన్ సహా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పురోగతి ఉంటుందని ఈ సర్వే తెలిపింది.
ఇదీ చదవండి: జాతికి ముప్పు చేసే టెక్నాలజీలు
కేంద్ర బడ్జెట్ 2025 అంచనాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం, గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం వంటి చర్యలతో జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment