పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం ఉన్న 4 శ్లాబులను 7 శ్లాబులుగా మారుస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కొత్తగా ప్రతిపాదించిన 7 శ్లాబుల విధానంలో పన్ను రేట్లు మునుపటికన్నా తగ్గుతాయి. కాకపోతే మునుపటి మాదిరి ట్యూషన్ ఫీజు, హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణంపై వడ్డీ, స్టాండర్డ్ డిడక్షన్, బీమా పాలసీలకు చెల్లించే మొత్తం, పీఎఫ్ వంటి మినహాయింపులేవీ ఈ విధానంలో ఉండవు. తగ్గించిన రేట్ల ప్రకారం నేరుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాత విధానం ప్రకారం పన్ను చెల్లించాలా? కొత్త విధానానికి మారాలా? అన్నది పూర్తిగా పన్ను చెల్లింపుదారు ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. నిజానికి కొత్త విధానం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది పన్ను నిపుణులు చెబుతున్న మాట!!.
Comments
Please login to add a commentAdd a comment