కేంద్ర బడ్జెట్‌ : రూపాయి రాక.. పోక.. | Union Budget 2020 : Rupee Comes From And Rupee Goes Out | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ : రూపాయి రాక.. పోక..

Published Sat, Feb 1 2020 3:42 PM | Last Updated on Sat, Feb 1 2020 4:41 PM

Union Budget 2020 : Rupee Comes From And Rupee Goes Out - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు.న్యూ ఇండియా, సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాని ఏయే మార్గాల ద్వారా ఎంత శాతం ఆదాయం వస్తుంది.. ఏయే పథకాలకు ఎంత శాతం ఖర్చు చేస్తున్నామనేది వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

ఆదాయం(రూపాయి రాక) 
రుణాలు- 20 శాతం
జీఎస్టీ, ఇతర పన్నులు- 18 శాతం
కార్పొరేట్ ట్యాక్స్- 18 శాతం
ఆదాయపు పన్ను- 17 శాతం
పన్నేతర ఆదాయం- 10 శాతం
కస్టమ్స్ సుంకాలు- 4 శాతం
కేంద్ర ఎక్సైజ్ పన్ను- 7 శాతం
రుణేతర మూలధన వసూళ్లు- 6 శాతం

(చదవండి : కేంద్ర బడ్జెట్‌ 2020 హైలైట్స్‌)


ఖర్చులు(రూపాయి పోక)
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా- 20 శాతం
కేంద్ర  ప్రాయోజిక పథకాలు- 9 శాతం
సబ్సీడీలు- 6 శాతం
వడ్డీ చెల్లింపులు- 18 శాతం
రక్షణ రంగం- 8 శాతం
కేంద్ర పథకాలు- 13 శాతం
పింఛన్లు- 6 శాతం
ఆర్థికసంఘం, ఇతర కేటాయింపులు- 10 శాతం
ఇతర ఖర్చులు- 10 శాతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement