rupee goes to
-
కేంద్ర బడ్జెట్ : రూపాయి రాక.. పోక..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల.. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు.న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని నిర్మల తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాని ఏయే మార్గాల ద్వారా ఎంత శాతం ఆదాయం వస్తుంది.. ఏయే పథకాలకు ఎంత శాతం ఖర్చు చేస్తున్నామనేది వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదాయం(రూపాయి రాక) రుణాలు- 20 శాతం జీఎస్టీ, ఇతర పన్నులు- 18 శాతం కార్పొరేట్ ట్యాక్స్- 18 శాతం ఆదాయపు పన్ను- 17 శాతం పన్నేతర ఆదాయం- 10 శాతం కస్టమ్స్ సుంకాలు- 4 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్ను- 7 శాతం రుణేతర మూలధన వసూళ్లు- 6 శాతం (చదవండి : కేంద్ర బడ్జెట్ 2020 హైలైట్స్) ఖర్చులు(రూపాయి పోక) కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా- 20 శాతం కేంద్ర ప్రాయోజిక పథకాలు- 9 శాతం సబ్సీడీలు- 6 శాతం వడ్డీ చెల్లింపులు- 18 శాతం రక్షణ రంగం- 8 శాతం కేంద్ర పథకాలు- 13 శాతం పింఛన్లు- 6 శాతం ఆర్థికసంఘం, ఇతర కేటాయింపులు- 10 శాతం ఇతర ఖర్చులు- 10 శాతం -
రూపాయి వచ్చేది, వెళ్లేది ఇలా..
కొన్ని లక్షల కోట్లతో కూడిన బడ్జెట్లో కేటాయింపులు చేయడం అంటే కత్తిమీద సామే అవుతుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలి, దానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కసరత్తు అంతటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలువురు నిపుణులు పూర్తి చేస్తారు. వారికి మార్గదర్శకాలను మాత్రం ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి తదితరులు ఇస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి.. రూపాయి రాక 1 అప్పులు, ఇతర రుణాలు - 21 2 కార్పొరేషన్ టాక్స్ - 19 3 ఆదాయపన్ను - 14 4 కస్టమ్స్ -9 5 కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ -12 6 సేవాపన్ను, ఇతర పన్నులు - 9 7 పన్నేతర ఆదాయం - 13 8 రుణేతర కేపిటల్ ఆదాయం 3 ---------------- రూపాయి పోక 1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం - 5 2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం - 9 3 కేంద్ర ప్రణాళిక - 12 4 వడ్డీల చెల్లింపు - 19 5 రక్షణ రంగం - 10 6 సబ్సిడీలు - 10 7 ఇతర ప్రణాళికేతర వ్యయం - 12 8 పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా - 23