కొన్ని లక్షల కోట్లతో కూడిన బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం అంటే కత్తిమీద సామే అవుతుంది. ఏయే రంగాలకు ఎంత కేటాయించాలి, దానికి ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కసరత్తు అంతటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలువురు నిపుణులు పూర్తి చేస్తారు. వారికి మార్గదర్శకాలను మాత్రం ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి తదితరులు ఇస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపాయి రాక, పోకల వివరాలు ఇలా ఉన్నాయి..
రూపాయి రాక
1 అప్పులు, ఇతర రుణాలు - 21
2 కార్పొరేషన్ టాక్స్ - 19
3 ఆదాయపన్ను - 14
4 కస్టమ్స్ -9
5 కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ -12
6 సేవాపన్ను, ఇతర పన్నులు - 9
7 పన్నేతర ఆదాయం - 13
8 రుణేతర కేపిటల్ ఆదాయం 3
----------------
రూపాయి పోక
1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయం - 5
2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రణాళికా సాయం - 9
3 కేంద్ర ప్రణాళిక - 12
4 వడ్డీల చెల్లింపు - 19
5 రక్షణ రంగం - 10
6 సబ్సిడీలు - 10
7 ఇతర ప్రణాళికేతర వ్యయం - 12
8 పన్నులు, డ్యూటీలలో రాష్ట్రాల వాటా - 23