న్యూఢిల్లీ: దేశాన్ని సమూలంగా మార్చడానికి తొమ్మిది ప్రాధాన్య రంగాలను గుర్తించినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ తొమ్మిది రంగాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం బడ్జెట్‌ను రూపొందింస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానంగా సామాజిక రంగం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన.. వీటి ద్వారానే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది ప్రాధాన్య రంగాలు ఇవీ..
1. వ్యవసాయం, రైతు సంక్షేమం
2. గ్రామీణ రంగం
3. సామాజిక రంగం
4. విద్యా నైపుణ్యాలు, ఉద్యోగ కల్పన
5. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు
6. ఆర్థిక రంగ సంస్కరణలు
7. పాలనా సంస్కరణలు, వ్యాపారం మరింత సులభతరం
8. ఆర్థిక క్రమశిక్షణ
9. పన్ను సంస్కరణలు