స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ షాక్‌ | Budget 2020 : Budget Fails To Impress Markets | Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ షాక్‌

Published Sat, Feb 1 2020 3:58 PM | Last Updated on Sat, Feb 1 2020 4:26 PM

Budget 2020 : Budget Fails To Impress Markets - Sakshi

ముంబై : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ నిరాశపరచడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3 శాతం నుంచి 3.8 శాతానికి సవరించడం, కీలక రంగాలకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బడ్జెట్‌ నిరాశపరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో వేయిపాయింట్లు పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరికి 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక భారీగా పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,650 పాయింట్ల దిగువన ముగిసింది. 

చదవండి : బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement