ఎల్‌టీసీజీ, ఎస్‌టీసీజీ, ఎస్‌టీటీ ట్యాక్సుల పెంపు ప్రభావం
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్రాష్
రోజంతా తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్
చివరికి స్వల్ప నష్టాల ముగింపు 79,224
రూపాయి: 83.72
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ అటు ఇంట్రాడే, ఇటు ముగింపు రెండింటిలో చరిత్రాత్మక కనిష్టాలను చూసింది. ఇంట్రాడేలో 83.72 స్థాయిని తాకితే, చివరికి క్రితం ముగింపుతో పోలి్చతే 3 పైసలు నష్టంతో 83.69 వద్ద ముగిసింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేట్ల పెంపు రూపాయి నష్టానికి కారణం.
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ), స్వల్పకాలిక మూలధన రాబడి(ఎస్‌టీసీజీ), ధీర్ఘ కాలిక మూలధన రాబడి(ఎల్‌టీసీజీ)లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచాయి.
అయితే పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు, ద్రవ్యోలోటు కట్టడికి చర్యల ప్రకటనలతో సూచీలు మళ్లీ పుంజుకొని స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, ఫైనాన్సియల్ సరీ్వసెస్, మెటల్, కమోడిటీస్, టెలికం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, సరీ్వసెస్, ఫార్మా, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు
బడ్జెట్ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 222 పాయింట్లు పెరిగి 80,725 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 24,569 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఎఫ్‌అండ్‌ఓ సెక్యూరిటీలపై ఎస్‌టీటీ, ఎల్‌టీసీజీ, ఎస్‌టీసీజీ పన్నుల పెంపు ప్రకటనలతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 1,278 పాయింట్లు క్షీణించి 79,224 పాయింట్ల వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు కుప్పకూలి 24,074 పాయింట్ల వద్ద కనిష్టాలను తాకాయి.
పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ప్రకటన తరువాత.., కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో సూచీలు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది.
‘‘బడ్జెట్‌లో మూలధన వ్యయాలకు అధిక కేటాయింపులు ఉండొచ్చని ఆశించారు. స్వల్పకాలిక మూలధన లాభాలపై (ఎస్‌టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్‌టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ)0.1%, 0.02 శాతం పెంపు అంశాలు స్టాక్ మార్కెట్‌కు కచి్చతంగా ప్రతికూల అంశాలు.
స్వల్ప కాలం పాటు ఎదురయ్యే ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలి. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అధిక కేటాయింపు ప్రకటనలు మార్కెట్ నష్టాలు తగ్గించాయి’’ మెహ్తా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.
⇒ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపుతో పాటు ఉద్యోగ కల్పనలకు పెద్ధ పీట వేయడంతో కన్జూమర్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించాయి. ఐటీసీ షేరు 5%, టాటా కన్జూమర్స్ ప్రొడెక్ట్స్, డాబర్ షేర్లు 3% పెరిగాయి. గోద్రేజ్ కన్జూమర్ ప్రోడెక్ట్స్, హెచ్‌యూఎల్, మారికో, బ్రిటానియా, కోల్గేట్, యూనిటెడ్ బేవరేజెస్, యూనిటెడ్ స్పిరిట్స్, బలరామ్‌పుర్ చినీ షేర్లు 2% నుంచి ఒకశాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment