సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాయామాన్ని మరింత పెంచితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మోదీ గతంలో విడుదల చేసిన ఓ వీడియోను జత చేస్తూ ఇచ్చిన ట్వీట్‌లో మోదీకి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ‘ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ మాయాజాల వ్యాయామాలు (మ్యాజికల్ ఎక్సర్‌సైజెస్)ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు’ అని వ్యంగ‍్యంగా ట్వీట్ చేశారు.
(చదవండి : నిస్సారమైన బడ్జెట్: రాహుల్)
కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ బడ్జెట్‌లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించింది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోందని ఆరోపిస్తోంది. ఉద్యోగాల సృష్టి, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం గురించి ఈ బడ్జెట్ పట్టించుకోలేదని దుయ్యబట్టింది.
Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020
Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0
Comments
Please login to add a commentAdd a comment