సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధికి రూ.99,300 కోట్లను కేటాయించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.3000 కోట్లను కేటాయించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్ ప్రసంగిస్తూ.. విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
(చదవండి : బడ్జెట్ 2020 : వ్యవసాయానికి పెద్దపీట)
2026 నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు తీసుకువస్తామన్నారు. విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సీటీని ప్రారంభిస్తామని తెలిపారు. భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రికి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment