
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించిందని తెలిపారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పక్షపాతం చూపిస్తుందనేది అవాస్తవమన్నారు. కేంద్రం రాష్ట్రాలకు నిధులకు కేటాయించకుండా ఎవరికి కేటాయిస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించారని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సమస్యలు ఉన్నట్లే, కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్.. రైతుల బడ్జెట్ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment